Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సాంగ్ చిత్రీకరణలో చిరంజీవి భోళా శంకర్

Chiranjeevi Bhola Shankar
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (16:17 IST)
Chiranjeevi Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భోళా శంకర్ తాజా షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది.
 
హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు.
 
మెహర్ రమేష్ చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో డాజ్లింగ్  బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది.
 
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
 తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో లాంఛనంగా ప్రారంభమైన సంధిగ్దం