Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నా గుండె చిక్కుకుంది` అంటోన్న అలీ

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (22:20 IST)
Ali, mouryani
‘‘నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో...’’ అంటూ అలీ ఓ గీతాన్ని కాశ్మీర్‌లో పాడుతున్నారు. అలీ, మౌర్యాని జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. ఈ పాట‌కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్ళింది. ఆరు రోజులపాటు కాశ్మీర్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్‌ చేశారు. ఈ సినిమాలోని అన్ని పాటలను ప్రముఖ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ రచించటం విశేషం. ఏ.ఆర్‌ రెహమాన్‌ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తున్నారు.  
 
మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేసుకుంది. 1100 సినిమాల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర  నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు. 
 
నరేశ్‌ సరసన పవిత్ర లోకేశ్, అలీకి జంటగా మౌర్యాని నటించారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ప్రణవి మానుకొండ నరేశ్‌ కూతురిగా కీలకపాత్రలో నటించారు.  షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ చానల్‌ శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకోవటంతో సినిమా టీమ్‌ ఆనందంతో ఉంది.  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం,లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడయో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments