ఆస్ట్రేలియా పార్లమెంట్ శృంగార చేష్టలకు అడ్డాగా మారింది. రాజకీయాలకు నిలయమైన పార్లమెంట్‌లో విచ్చలవిడిగా శృంగార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫీసుల్లోనే పార్లమెంట్ సిబ్బంది శృంగారంలో తేలిపోతున్న కొన్ని వీడియోలు ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెక్స్ వీడియోలు లీకైన ఘటనలో తాజాగా ఓ ఉద్యోగిని తొలగించారు. మహిళా ఎంపీ డెస్క్ వద్ద .. శృంగారం చేస్తున్న ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వీడియోలు దేశ ప్రతిష్టకు అవమానకరమని ప్రధాని స్కాట్ మారిసన్ అన్నారు. రక్షణ కార్యాలయంలో పనిచేస్తున్న మాజీ ఉద్యోగిని తనపై లైంగిక దాడి జరిగినట్లు ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో రక్షణ మంత్రి క్షమాపణలు కూడా చెప్పారు.
పార్లమెంట్‌లో ఎవరైనా ఏమైనా చేయవచ్చు అన్న ఉద్దేశంతో కొంత మంది సిబ్బంది వ్యవహరిస్తున్నారని వీడియోలు బయటపెట్టిన వ్యక్తి తెలిపారు. ఉద్యోగులు చాలా వరకు నైతికంగా దివాళా తీసినట్లు టామ్ అనే వ్యక్తి ఆరోపించాడు.
కొత్త సెక్స్ వీడియోలపై ప్రధాని స్కాట్ మారిసన్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ఆ వీడియోలు తనను షాక్‌కు గురిచేసినట్లు ఆయన తెలిపారు. సభను మళ్లీ ఆర్డర్‌లోకి తీసుకురావాలని, రాజకీయాలను పక్కనపెట్టి, సమస్యను గుర్తించాలన్నారు.