Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సాయంతో దర్శకనిర్మాతలను కాకాపడుతున్న హీరోయిన్!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:34 IST)
టాలీవుడ్ అందాల నటీమణుల్లో సీరత్ కపూర్ ఒకరు. ఈమె గతలంలో 'రన్ రాజా రన్', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' వంటి చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ రెండు చిత్రాల్లో 'రన్ రాజా రన్' చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడు కెరీర్‌కు బ్రేక్ లభించలేదు. 
 
అయినప్పటికీ సినిమాపై ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. ఎలాగైనా సినీ రంగంలో నిలదొక్కుకోవాలన్న తపనతో తన మకాంను హైదరాబాద్ నుంచి ముంబైకు మార్చింది. అక్కడ కూడా తనకు అదృష్టం కలిసిరాకపోవడంతో తిరిగి భాగ్యనగరికే వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే 'మా వింత గాథ వినుమా' అనే చిత్రంలో తళుక్కున మెరిసింది. 
 
అయినప్పటికీ.. ఆమెకు లక్కీ ఛాన్స్ రాలేదు. దీంతో దర్శక నిర్మాతలను బుట్టలో వేసుకునేందుకు ఓ కొత్త యువహీరో సాయం తీసుకుంది. అతని పేరు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ యువ హీరో ఓటీటీ ఫ్లాట్‌ ఫాంలో దూసుకెళ్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. 
 
ఈయన ద్వారా టాలీవుడ్‌లో మంచి రోల్స్ పొందాలని సీరత్ కపూర్ భావిస్తోంది. పైగా, ఈమెకు సిద్ధూ కూడా బాగానే సాయం చేస్తున్నాడట. స్నేహితుడైన సిద్ధూ సాయంతో సీర‌త్ క‌పూర్ ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో వారి సినిమాల్లోకి తన‌ను తీసుకునే విష‌య‌మై ప‌లువురు సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ట‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments