Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ప్రాణం ఉన్నంతవరకు సహాయం అందిస్తూ ఉంటా: సోనూ సూద్

Advertiesment
నా ప్రాణం ఉన్నంతవరకు సహాయం అందిస్తూ ఉంటా: సోనూ సూద్
, సోమవారం, 16 నవంబరు 2020 (19:43 IST)
సోనూ సూద్ సహాయానికి నిలువెత్తు నిదర్శనం. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను ఆదుకుని వారిని వాళ్ల సొంత రాష్ట్రానికి చేర్చిన ఘనత చిరస్మరణీయం. పేదలకు సాయం చేయడంలో సోనుసూద్ పాత్ర మరువరానిది. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి పేదల పెన్నిధిగా నిలిచాడు.
 
సోనూసూద్ సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అతన్ని స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ బిరుదుతో సత్కరించింది. ఇదిలా ఉండగా తాజా దీపావళి సందర్భంగా ఓ చానల్లో ప్రసారమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోనుసూద్ మాట్లాడుతూ తాను సామాజిక సేవలు అందించడానికి తన తల్లిదండ్రులే స్పూర్తిదాయకం అని తెలిపారు. అయితే వాళ్లు తనతో లేనప్పటికీ తన సేవలను చూసి గర్విస్తారని తాను ఆశిస్తున్నానని తెలిపారు.
 
చిన్నప్పుడు నిజమైన సక్సెస్ ఏమంటే సాయం అని అడిగినవారికి వెంటనే ఆదుకోవడమే అని తన తల్లి చెప్పినట్లు సోనుసూద్ వెల్లడించారు. అయితే తాను అందిస్తున్న సేవలకు దేవునితో పోల్చడం సరికాదని తెలిపారు. తాను అందరిలా సామాన్యుడునని, సాయం అన్నవారి కోసం బాధపడతానని తెలిపారు. తన ప్రాణం పోయేంతవరకు సహాయం చేస్తూ ఉంటానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహనకృష్ణ ఇంద్రగంటి ''రాళ్ళలో నీరు''.. ఐదు అంటే ఐదే పాత్రలే...