గాడ్ ఫాద‌ర్‌లోని మెగాస్టార్స్ చిరంజీవి, స‌ల్మాన్ కోసం నిరీక్షణ ఫ‌లిస్తుందా!

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (12:10 IST)
Chiranjeevi, Salman
గాడ్ ఫాద‌ర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్‌ఖాన్‌లు క‌లిసి ఓ డాన్స్‌లో న‌ర్తించారు. తార్‌మార్ థక్కర్‌మార్ లిరికల్ వ‌స్తుంద‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. కానీ ఆడియో ఫైల్ విడుద‌ల చేశారు. కొన్ని సాంకేతిక కార‌ణాల‌వ‌ల్ల అనుకున్న టైంకు విడుద‌ల‌చేయ‌లేక‌పోయామ‌ని ఆ త‌ర్వాత ట్విట్ట‌ర్‌లో చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పుడు ఇక నిరీక్ష‌ణ ముగిసింది అంటూ ఓ కాప్ష‌న్‌తో చిరంజీవి పోస్ట్ చేస్తూ సెప్టెంబ‌ర్ 21న సాయంత్రం 4గ‌గంట‌ల 5 నిముషాల‌కు విడుద‌ల‌వుతుంద‌ని పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.
 
కాగా, నిన్న‌నే విడుద‌లైన ఈ సినిమాలోని చిరంజీవి డైలాగ్ పెద్ద వైర‌ల్ అయింది. అందుకు కార‌ణం రాజ‌కీయాల గురించి ఆయ‌న చెప్పిన డైలాగ్‌. నేను రాజ‌కీయంకు దూరంగా వున్నాను. కానీ నానుంచి రాజ‌కీయం దూరం కాలేదు. అన్న మాట‌లు సినిమాలోని ఓ సంద‌ర్భంలో చెప్పేవి. కానీ ఆయ‌న అభిమానులు బ‌య‌ట త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ కొంద‌రు కామెంట్లు చేస్తూ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని ఇద్ద‌రు స్టార్స్ డాన్స్ చేసిన సాహిత్యం పెద్ద‌గా ఆక‌ట్టుకులేక‌పోయింద‌నీ, స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోను స‌రిగ్గా ఉప‌యోగించుకోలేద‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త వినిపిస్తోంది. మ‌రి ఇంత‌కాలం ఇద్ద‌రు మెగాస్టార్ల కోసం చేసిన నిరీక్ష‌ణ ఫ‌లిస్తుందా లేదో ద‌సరాకు చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments