అడ‌విలో అధికారం కోసం నేనే వస్తున్నా అంటున్న ధ‌నుష్‌ (video)

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (11:55 IST)
dhanush
ధనుష్ న‌టించిన నేనే వస్తున్నా  అనే చిత్రంలోని వీరా సూర ధీర రారా.. అడ‌విలో నీదే అధికారం.. అంటూ సాగే పాటను  విడుదల చేసింది చిత్ర‌యూనిట్‌.  ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి.
ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. "నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.
 
తాజాగా ఈ చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు.
"వీరా సూర ధీర రారా
మతి బెదర
గతి చెదర
అడవంతా నీ అధికారం ఔరా"
లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
 
“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై  "కలైపులి ఎస్ థాను" నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.
 
నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు
 
సాంగ్ క్రెడిట్స్: రచన: చంద్రబోస్,  సంగీతం: యువన్ శంకర్ రాజా,  సింగర్: రాహుల్ నంబియార్ 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.3 కోట్ల విలువైన డ్రోన్లు, ఐఫోన్లు, ఐవాచ్‌లు.. హైదరాబాదులో అలా పట్టుకున్నారు..

కాళ్లపై కారం కొట్టి బంగారు మంగళసూత్రాన్ని లాక్కున్న దుండగులు

ముంబై తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర : టార్గెట్ లిస్టులో ఇండియా గేట్

నవంబర్ 15కి వాయిదా పడిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలకు కాంగ్రెస్ సిద్ధం

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం : ధర్మారెడ్డికి కష్టాలు తప్పవా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments