Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు కథ చెప్పేందుకు క్రిష్ రెడీ.. మణికర్ణికకు తర్వాత పవర్ స్టార్‌తో సినిమా?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌తో మణికర్ణిక చేస్తున్న క్రిష్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (12:02 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌తో మణికర్ణిక చేస్తున్న క్రిష్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గమ్యం, వేదం, కంచె,  గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్.. మణికర్ణికకు తర్వాత పవన్ కల్యాణ్‌కి ఒక కథ వినిపించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. 'కంచె' సినిమా కంటే ముందుగానే పవన్‌తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో క్రిష్ గట్టి ప్రయత్నాలే చేశారు గానీ అవి ఫలించలేదు.
 
అయితే ఈ సారి మాత్రం పవన్‌తో సినిమా చేయాలని క్రిష్ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే సమయం దొరికినప్పుడల్లా క్రిష్ పవన్ సినిమాకి సంబంధించిన కథపైనే కూర్చుంటున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో సినిమా లైన్‌లో ఉంది. మరోవైపు 2019 ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 
 
వీలైనంత తొందరకు షెడ్యూల్ అయిన మూవీలను కంప్లీట్ చేసి రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు కొత్త సినిమాలేవీ పవన్ ఒప్పుకునే పరిస్థితిలేదు. మరి క్రిష్ చెప్పే కథను పవన్ ఓకే చేస్తాడో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments