Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సంఘమిత్ర'' నుంచి శ్రుతిహాసన్ బ్రేకప్ అందుకేనా? సెట్స్‌పైకి వెళ్తుందా?

''సంఘమిత్ర'' సినిమా నుంచి శ్రుతిహాసన్ తప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేన్స్‌ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారన్న విషయం తెలిసిందే. ఆ పోస్

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (17:53 IST)
''సంఘమిత్ర'' సినిమా నుంచి శ్రుతిహాసన్ తప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేన్స్‌ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారన్న విషయం తెలిసిందే. ఆ పోస్టర్‌ను చూసి జనాలు రకరకాలుగా సోషల్ మీడియాలో స్పందించడంతోనే శ్రుతిహాసన్ తప్పుకున్నట్లు సమాచారం. సంఘమిత్ర పోస్టరుపై దారుణమైన కామెంట్లు రావడంతో శ్రుతిహాసన్ మనస్తాపానికి గురైంది.
 
అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్లో శ్రుతిహాసన్ అసలు రూపం లేకపోవడం, కేన్స్ లాంటి వేదికలపై ఆవిష్కరించిన పోస్టర్లో శ్రుతి మిస్ కావడం.. ఆ ఫోటోలో పెయింటింగ్ ఉపయోగించడం వంటి కారణాలే శ్రుతికి కోపాన్ని తెప్పించాయి. అందుకే ఈ సినిమా నుంచి శ్రుతిహాసన్ ఉన్నట్టుండి తప్పుకుందని సినీ పండితులు చెప్తున్నారు. 
 
శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా ‘సంఘమిత్ర' సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు సుందర్ ప్రకటించగానే తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ ప్రకటించడంతో.. శ్రుతిహాసన్ కూడా హ్యాపీగా డీల్ ఓకే చేసింది. అంతేగాకుండా ఈ సినిమా ప్రారంభానికి ముందే కత్తిసాము, యుద్ధ పోరాటాలకు సంబంధించిన విద్యలను శిక్షణ పొందింది. కానీ శ్రుతిహాసన్ తప్పుకోవడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే అనుమానం ఏర్పడింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments