Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా అతిపెద్ద షో "బిగ్ బాస్"

"సరికొత్త ఉత్తేజం" అనే నినాదంతో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పంతోనే తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద షో, "బిగ్ బాస్"ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా. నటనకి స్టార్ ఇమేజ్ మారుపేరయిన

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (16:18 IST)
"సరికొత్త ఉత్తేజం" అనే నినాదంతో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పంతోనే తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద షో, "బిగ్ బాస్"ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా. నటనకి స్టార్ ఇమేజ్ మారుపేరయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని మొట్టమొదటిసారిగా బుల్లితెర మీదకి తీసుకువస్తోంది "బిగ్ బాస్" షో. 
 
యువతరం అగ్ర కథానాయకుడు బుల్లితెరపై ఇంత పెద్ద షోను హోస్ట్ చేయటం బహుశా దక్షిణభారతదేశంలో ఈమధ్య కాలంలో ఇదే ప్రథమం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ బిగ్‌బాస్ షో ఎండెమోల్ సంస్థకు చెందినది. హిందీలో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే పది సీజన్‌లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ షోను ఎన్టీఆర్ తీసుకువస్తారు. 
 
ప్రత్యేకంగా నిర్మించిన ఒక ఇంట్లో, సుమారు డజను మంది సెలబ్రిటీలను పెట్టి తాళం వేస్తారు. వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తారు. కానీ బయట ప్రపంచంతో కానీ, సెల్‌ఫోన్‌లు టీవీలు, పేపర్‌లు వంటి మాధ్యమాలతో కానీ వారికి సంబంధం ఉండదు. ఆ ఇల్లే వారి ప్రపంచం. వారి ప్రతి కదలికను కెమెరాలు రికార్డు చేస్తూనే ఉంటాయి. వీరి జీవన శైలిని ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం లేని వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధంలేని ఒక ఇంట్లో ఎలా ఉండగలుగుతారు అనేది ఆసక్తికరమైన అంశం. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, "టీవీ అనేది ఏంతో ప్రాముఖ్యత కలిగిన ఎంటర్టైన్మెంట్ మాధ్యమం. తెలుగు టీవీ చరిత్రలోనే అతి పెద్ద షోగా రూపొందుతోన్న "బిగ్ బాస్"ను హోస్ట్ చేయమని స్టార్ మా వారు నన్ను సంప్రదించినప్పుడు, చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ షో తప్పకుండా ఒక గేమ్ చేంజర్ అవుతుంది" అన్నారు. 
 
స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ, "తెలుగులో అత్యంత భారీ స్థాయిలో ఈ బిగ్ బాస్ షోను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రారంభించటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు టీవీ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విలువలను, ఎంటర్టైన్మెంట్‌ను అందించటమే స్టార్ మా లక్ష్యం. ఇందుకు బిగ్ బాస్ షో ఎంతగానో దోహదపడుతుంది. తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా ఈ షో ఉంటుంది. గత కొద్దికాలంగా స్టార్ మా ప్రోగ్రామింగ్ స్ట్రాటజీలో చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. కొత్త షోలు కొత్త ప్రోగ్రాంలతో మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యే దిశగా స్టార్ మా అడుగులు వేస్తోంది" అని అన్నారు. 
 
స్టార్ టీవీ నెట్వర్క్‌లో ఒక భాగం అయిన స్టార్ మా గ్లోబల్ కంపెనీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌లో ఒక భాగం. స్టార్ మా, స్టార్ మా HD, మా మ్యూజిక్, మా మూవీస్ మరియు మా గోల్డ్ ఈ స్టార్ మా నెట్వర్క్‌లో ఉన్న ఐదు ఛానళ్ళు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం.. వేట కత్తులతో కలర్ ల్యాబ్‌ ఓనర్ హత్య

విశృంఖల ప్రేమకు చిరునామాగా మెట్రో రైళ్లు! బెంగుళూరు మెట్రోలో యువకుడి విపరీత చర్య! (Video)

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments