పవన్ తన అన్న కుమార్తె నిహారిక పెళ్లికెళితే క్రిష్‌కి టెన్షన్ ఎందుకు?

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (19:39 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌.. ఓ భారీ పిరియాడిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. కరోనాకి ముందు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసారు. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకుంటే కరోనా వచ్చింది. అయితే... పవన్ డేట్స్ ఇవ్వడానికి టైమ పడుతుంది కనుక ఈ గ్యాప్‌లో సినిమా చేద్దామని వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా స్టార్ట్ చేసారు.
 
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే... ఇటీవల పవన్ వకీల్ సాబ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత క్రిష్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు అనుకుంటే... అయ్యప్పన్ కోషియమ్ రీమేక్‌కి టైమ్ ఇచ్చారు. దీంతో క్రిష్ తన సినిమాకి డేట్స్ ఇవ్వమని కనీసం పది రోజులు డేట్స్ ఇచ్చినా... ఓ షెడ్యూల్ కంప్లీట్ చేస్తానన్నారు. ఆఖరికి క్రిష్ ప్రయత్నం ఫలించింది.
 
డిసెంబర్‌లో ఓ పది రోజులు డేట్స్ ఇస్తానన్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటే... ఇప్పుడు ఓ సమస్య వచ్చింది. అది ఏంటంటే... నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లి డిసెంబర్‌లో వుంది. దానికి కనుక పవన్ హాజరైతే వకీల్ సాబ్ షెడ్యూలు దెబ్బతింటుంది.
 
 పెళ్లికి వెళితే... వకీల్ సాబ్ షూటింగ్ ఆలస్యం అవుతుంది. అలా జరిగితే... క్రిష్ సినిమాకు సమస్య వస్తుంది. అలా అని పెళ్లికి వెళ్లకుండా వుండలేరు. సొంత అన్న కూతురు పెళ్లి. అందుచేత పవన్ ఏం చేస్తారో అని క్రిష్‌ టెన్షన్ పడుతున్నారని టాక్. పాపం.. క్రిష్. ఆయన సినిమాలకి ఏదో సమస్య వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments