Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను పారిపోను, సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటా: పవన్ కళ్యాణ్

Advertiesment
నేను పారిపోను, సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటా: పవన్ కళ్యాణ్
, మంగళవారం, 17 నవంబరు 2020 (15:05 IST)
జనసేన పవన్ కల్యాణ్ మంగళగిరిలో ప్రారంభమైన పార్టీ క్రియాశీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారుల లక్ష్యం వేల కోట్లను కూడగట్టుకోవడం కాదన్నారు. ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడమే అధికారి లక్ష్యమన్నారు.
 
సమస్యను ఎత్తి చూపితే పరిష్కారం చూపకుండా విమర్శలు చేయడమే పాలకుల లక్ష్యమని తెలిపారు. తనకు సమస్యలను చూచి పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాటలను మార్చేస్తున్నారని, అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
 
విభజించి పాలించే విధానంతో ముందుకెళుతున్నారని ఆరోపించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమని ఉద్ఘాటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా తన పుట్టిన రోజు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా