Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కు ఎందుకు హైప్ రావడంలేదు - కారణం అదేనా ?

డీవీ
మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:41 IST)
Melbourne-Ramcharan
ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఆ తర్వాత చేస్తున్న గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలో భారీ తారాగణం వున్నా ఎందుకనే సినిమా హైప్ తీసుకురాలేకపోయింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా ప్లాప్ కూడా చరణ్ సినిమాపై పడుతుందనే టాక్ కూడా వుంది. 
 
మరోవైపు రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్. చేశాక హీరోలకు వెంటనే సక్సెస్ కూడా రాదనే టాక్ కూడా నెలకొంది. మరి ఈ సినిమాకు అభిమానుల్లోనూ పెద్ద బజ్ కూడా లేదు. భారతీయుడు2 సినిమాను చరణ్ ఫ్యాన్స్ మొదటివారంలోనే చూశారు. తన హీరో సినిమా ఎలా వుంటుందో అని బేరీజు కూడా వేశారు. దానితో వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. 

ఇక గేమ్ ఛేంజర్ విడుదలకుముందు చరణ్ వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో విదేశాలలో వున్నారు. ఇటీవలే మెల్బోర్న్ వెళ్లారు.. అక్కడ కూడా  గేమ్ చంగెర్ గురించి చర్చ వచ్చింది. బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చరణ్ అన్నట్లు తెలిసింది.  నేడు ఆయన తిరిగి హైదరాబాద్ కూడా వచ్చారు. 
 
కనుక ముందుముందు ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా చేయించాలనే ప్లాన్ లో వున్నారు. ఇప్పటికి రెండు పోస్టర్లు, ఒక మాస్ పాటను రిలీజ్ అయింది. ఆగస్ట్ నెలాఖరులోగా అప్డేట్ చేస్తామని సంగీత దర్శకుడు థమన్ ఇటీవలే తెలియజేశారు. ఈ తాజా  అప్డేట్ సెప్టెంబర్ రెండవ వారంలో మాత్రమే రానుందని తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, అంజలి శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, శుభలేక సుధాకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments