Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెగ్యులర్ షూటింగ్ లో శివాజీ, లయ కాంబినేషన్ చిత్రం

డీవీ
మంగళవారం, 20 ఆగస్టు 2024 (15:43 IST)
shivaji- laya
శివాజీ లయ జంటగా కలిసి నటించిన సినిమాలు 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్ ని కూడా అందించాయి. మళ్ళీ వీరిరువురు జంటగా నటిస్తున్నారు. 
 
శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం.2 గా శివాజీ లయ లు హీరో హీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు.
 
మంగళవారం అనగా నేటి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. థ్రిల్లర్, ఫామిలీ డ్రామాతో పాటు ఎంటర్టైన్మెంట్ కథగా ఈ సినిమా ఉండబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యతో వివాహేతర సంబంధం ఉందని భర్త ఘాతుకం... యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు...

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments