Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మీ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (10:29 IST)
ఛార్మింగ్ గాళ్ ఛార్మీ కౌర్. అగ్రహీరోల సరసన నటించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నటనకు దూరమైంది. 
 
పూరి దర్శకత్వంలో రూపొందిన "జ్యోతిలక్ష్మి" సినిమాలో నటించిన ఛార్మి... ఆ తర్వాత మళ్లీ తెర పై కనపడలేదు. ఓ మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకుంటే... ఇప్పటివరకు మరో సినిమాలో నటించలేదు. అయితే.. ఇటీవల సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 
 
ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే... ఇక తను సినిమాల్లో నటించను అని ప్రకటించింది. ఇంత సడన్ గా ఏంటి..? ఈ ప్రకటన అంటే... ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 'జ్యోతిలక్ష్మి' సినిమా సమయంలో తీసుకున్న నిర్ణయమని.. అప్పుడే ఎనౌన్స్ చేస్తానంటే... డైరెక్టర్ పూరి, నిర్మాత సి.కళ్యాణ్ వద్దని చెప్పడంతో ఆగిపోయానని అన్నారు. 
 
నిర్మాతగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. యాక్టింగ్ కంటే.. ప్రొడక్షనే తను కిక్ ఇస్తుందని చెప్పారు ఛార్మి. ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పూరి డైరెక్షన్‌లో చేస్తున్న మూవీ కరోనా కారణంగా ఆగింది. లేదంటే... ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండేదాన్ని అని చెప్పారు. 
 
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత హడావిడిగా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకోవడం లేదు. కొంత టైమ్ తీసుకుని అంతా సెట్ అయిన తర్వాతే షూటింగ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నట్టు తెలియచేసారు ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ ఛార్మింగ్ గాళ్ విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments