Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ త‌ప్పుకున్నాడు... మ‌రి ఎన్టీఆర్ బ‌యోపిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వివాదం మొద‌లైంది. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో అభిమానులు, స‌న్నిహితులు వ‌ర్మ డైరెక్ష‌న్లో ఎన్టీఆర్ బ

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (13:37 IST)
ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వివాదం మొద‌లైంది. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో అభిమానులు, స‌న్నిహితులు వ‌ర్మ డైరెక్ష‌న్లో ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌ద్ద‌ని చెప్ప‌డంతో వ‌ర్మ ప్లేస్‌లో తేజ వ‌చ్చారు. దీంతో బాగా ఫీలైన వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆ త‌ర్వాత స‌న్నిహితుల సూచ‌న మేర‌కు వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ని ప‌క్క‌న పెట్టేసాడు.
 
తేజ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టించే ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభోత్స‌వం సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభమైంది. జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ద‌స‌రాకి ఈ సినిమా రిలీజ్ అని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఇంత‌లోనే ఏమైందో ఏమో కానీ... ఊహించ‌నివిధంగా తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తేజ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు అనేది ప‌క్క‌న పెడితే ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
 
అయితే... ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం... ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి నలుగురు ద‌ర్శ‌కుల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఆ న‌లుగురు ఎవ‌రంటారా..?  రాఘ‌వేంద్ర‌రావు, పి.వాసు, కృష్ణ‌వంశీ, పూరి జ‌గ‌న్నాథ్‌..! ఈ న‌లుగురిలో ఎవ‌రో ఒక‌రు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ న‌లుగురితో పాటు బాల‌య్య పేరు కూడా ప్ర‌ధానంగా వినిపిస్తోంది. అవును... బాల‌య్యే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు అంటున్నారు కొంతమంది. మ‌రి.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments