Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి మూవీలో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ రిలేష‌న్ ఏంటో తెలుసా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్ర్కిప్ట్

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (22:02 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్‌ల‌పై ఫోటో షూట్ చేయ‌నున్నారు. దీని కోసం ఎన్టీఆర్, చ‌ర‌ణ్ యు.ఎస్ వెళ్లారు. వారం రోజుల పాటు ఈ ఫోటో షూట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు చ‌ర‌ణ్ అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా... ఎన్టీఆర్, చ‌రణ్‌ల పాత్రలు ఎలా వుండనున్నాయనే కుతూహలంతో వున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్, తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనేది తాజా సమాచారం.
 
మ‌రో విష‌యం ఏమిటంటే.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఇది స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదట‌. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట‌. బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్న కుటుంబక‌థా చిత్ర‌మ‌ని తెలిసింది. ఆగ‌ష్టులో ప్రారంభించే ఈ సినిమా పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments