Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఆగలేను.. పెళ్లి పీటలెక్కుతానంటున్న హీరోయిన్.. ఎవరు? (Video)

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (22:53 IST)
దక్షిణ భారత తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. 2003లో వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం 35 యేళ్లు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. ముఖ్యంగా, పలువురుతో ప్రేమాయణం జరిపింది. ఇందులో తొలుత తమిళ హీరో శింబు. ఆ తర్వాత ప్రముఖ డ్యాన్సర్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసింది. నయనతార కోసం ప్రభుదేవా తన భార్య రమ కోసం ఏకంగా విడాకులు కూడా ఇచ్చాడు. కానీ, ప్రభుదేవా - నయనతారలు విడిపోయారు. 
 
ఆ తర్వాత కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలోపడింది. ఈ దర్శకుడు కూడా ఈ అమ్మడుపై పిచ్చి ప్రేమను చూపిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరూ ఎంచక్కా విదేశీ టూర్లకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఇకపై బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాఫ్ పెట్టి... తన ప్రియుడిని వివాహం చేసుకోవాలని నయన్ కుట్టి ఓ నిర్ణయానికి వచ్చిందట. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడికావొచ్చని తెలుస్తోంది. 
 
కాగా, 2006లో తెలుగులోకి "లక్ష్మి" చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అనేక మంది హీరోలందరితో కలిసి నటించింది. ప్రస్తుతం అటు తమిళం, ఇటు తెలుగులో లేడీ సూపర్ స్టార్ హోదాను సొంతం చేసుకుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments