Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు పంచ్‌లిచ్చిన కమెడియన్ వివేక్... డొంక తిరుగుడు మాటలు బాగానే చెప్తారంటూ...

కార్తీ హీరోగా పి.వి.పి.సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా'. ఈ చిత్రంలో కార్తీ సరసన శ్రీ దివ్య, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (15:52 IST)
కార్తీ హీరోగా పి.వి.పి.సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా'. ఈ చిత్రంలో కార్తీ సరసన శ్రీ దివ్య, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో కూడా భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ కానుండగా.. కోలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే భారీ రిలీజ్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా అక్టోబర్‌ 28న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్‌ హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. 
 
అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో కార్తీ.. రెండు ఏరియాల్లోనూ ప్రచారం జరుపుతున్నాడు. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొన్న తమిళ కమెడియన్ వివేక్.. కొందరు హీరోయిన్స్ అంటూ జనరలైజ్ చేసి నయనతారకు పంచ్‌లిచ్చాడు. ''కొందరు హీరోయిన్లు ప్రమోషన్స్‌లో పాల్గొనడం మానేస్తుంటారు. ఇందుకు వారు చెప్పే సమాధానం కూడా చాలా తెలివిగా హుందాగా ఉంటుంది. 
 
తాను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటే సినిమా ప్లాప్ అవుతుందని సెంటిమెంట్ అంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ.. నిర్మాతలను భయపెడుతూ ఉంటారు. ఇదే మాదిరిగా వీళ్లు పూర్తిగా రెమ్యూనరేషన్ తీసుకున్నా సరే సినిమా ఫెయిల్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటే బాగుంటుందేమో'' అన్నాడు వివేక్. 
 
ఈ కామెంట్స్ చేసినపుడు.. నయనతార పేరును చెప్పలేదుకానీ... ఇది కేవలం నయనతార మాత్రమే వర్తిస్తుందని అందరికీ తెలిసిందే. ఇలా మీడియాలో నయనతారకు పంచ్ వేశాడు అనే రచ్చ ఎక్కువైపోవడంతో.. ''నేను నయన్‌కు పెద్ద వీరాభిమానిని... నేను చెప్పింది నయన్‌ను ఉద్దేశించి కాదు'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వివేక్. ఈ హీరో ఎన్ని క్లారిటీలు ఇచ్చినా.. అక్కడ పంచ్ పడింది నయనకేనని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

JanaSena: వైఎస్ఆర్సీపీకి తీవ్ర ఎదురుదెబ్బ- జేఎస్పీలో ఒంగోలు, తిరుపతి నేతలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments