ఎవడే సుబ్రమణ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి.. పెళ్లి చూపులు సినిమాతో కమర్షియల్ సక్సస్ సాధించి.. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టంచి.. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో విజయ్
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి.. పెళ్లి చూపులు సినిమాతో కమర్షియల్ సక్సస్ సాధించి.. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టంచి.. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ్‌లో రూపొందించిన చిత్రం నోటా. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన నోటా అక్టోబరులో రిలీజ్‌కి రెడీ అయ్యింది. అయితే... ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబర్ 5న రిలీజ్ చేద్దాం అనుకున్నారు.
కానీ.. ఈ సినిమా వచ్చిన వారానికి ఎన్టీఆర్ అరవింద సమేత రిలీజ్ కానుంది. అందుచేత ఎన్టీఆర్ మూవీ వస్తే నోటాని థియేటర్స్ నుంచి తీసేస్తారని అక్టోబర్ 18న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. 18న వస్తాం అంటే దిల్ రాజు హలో గురు ప్రేమ కోసమే సినిమా ఉంది. థియేటర్స్ కష్టం అన్నారట. దీంతో నిర్మాతకి ఏం చేయాలో తెలియడం లేదట.
మరోవైపు విజయ్ దేవరకొండ మదర్‌కి ఆరోగ్యం సరిగా లేదట. ప్రస్తుతం విజయ్ ఆ టెన్షన్‌లో ఉన్నాడట. 5నే రిలీజ్ చేద్దాం అనుకుంటే... ఆ టైమ్‌కి ప్రమోషన్ బాగా చేయాలి కానీ.. విజయ్ మదర్ హెల్త్ టెన్షన్‌లో ఉండటంతో ప్రమోషన్లో పాల్గొనలేని పరిస్థితి అట. దీంతో అటు విజయ్, ఇటు జ్ఞానవేల్ రాజా తెగ టెన్షన్ పడుతున్నారట.