చ‌ర‌ణ్ సినిమానే విజ‌య్ చేస్తున్నాడా..?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (18:24 IST)
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ సంచ‌ల‌న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌ల డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు కానీ... ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాడు. దీంతో విజ‌య్ త‌దుప‌రి చిత్రంపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు అభిమానులు. 
 
ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా చేస్తున్నాడు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టుగా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాలో చాలా ప్రేమకథలు ఉంటాయని తెలిసింది. రాశీ ఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
నలుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కూడా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. కాలేజ్ స్టూడెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బైక్ రేసర్, మధ్య తరగతి వ్యక్తి పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నాడట.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా క‌థ రామ్ చ‌ర‌ణ్ ఆరెంజ్ సినిమా క‌థ‌లా ఉంటుంద‌ట‌. ఇందులో చ‌ర‌ణ్ ప్రేమిస్తాను కానీ... ఎప్ప‌టికీ ఒకేలా ప్రేమించ‌లేను అంటుంటాడు. విజ‌య్ కూడా ఇందులో అలాగే అంటుంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి... ఇదే క‌నుక నిజ‌మైతే ఈ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో..?  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

చమురు దిగుమతులపై మరోమారు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. లెక్క చేయని భారత్...

హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం - ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments