Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ, ఇంతకీ ఎవరా డైరెక్టర్?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (21:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చేయనున్నాడు అంటూ ఓ వార్త టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ... కరోనా వలన షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో వకీల్ సాబ్ రిలీజ్ వాయిదా పడింది.
 
అయితే... ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇటీవల దిల్ రాజుకు ఓ స్టోరీ వినిపించాడట. ఈ కథ దిల్ రాజుకు బాగా నచ్చిందట. ప్రభాస్‌కి అయితే.. ఈ స్టోరీ బాగుంటుందని వేణు శ్రీరామ్‌ని ప్రభాస్ దగ్గరకి పంపించి కథ చెప్పించారని తెలిసింది. కథ విని ప్రభాస్ కూడా ఓకే చెప్పారని టాక్. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లేకపోవడం వలన వేణు శ్రీరామ్ ఈ స్టోరీపై వర్క్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభాస్ దిల్ రాజు బ్యానర్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా చేసాడు. దశరథ్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
 
బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయాలనే కోరిక దిల్ రాజుకు మరింత పెరిగింది. ప్రభాస్‌తో సినిమా చేయడానికి కావాల్సిన కథ దొరికింది. ఇక ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం. 
 
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ భారీ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్‌తో సినిమా చేయడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ప్రభాస్ స్పందిస్తాడేమో చూడాలి.
 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments