Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్సరా రాణితో వర్మ చాటింగ్, ఏంటది?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (23:53 IST)
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్‌తో తనదైన శైలిలో స్పందిస్తూ వర్మ. అలాగే గత కొన్నిరోజులుగా ట్విట్టర్ వేదికగా వర్మ చేస్తున్న ట్వీట్లు రచ్చకు కారణమవుతున్నాయి.

 
ఇక ఇటీవల వర్మ ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోస్, పార్టీ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో అప్సరా రాణితో చేసిన ముచ్చట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

 
అప్సర రాణిని తెలుగుతెరకు పరిచయం చేసింది రాంగోపాల్ వర్మనే. ఆర్జీవీ తెరకెక్కించిన చిత్రాల ద్వారానే అప్సర రాణి ఫేమస్ అయ్యింది. ఇక పలు చిత్రాల్లో ఐటం సాంగ్‌లలో నటించి మెప్పించింది అప్సర రాణి. తాజాగా ఈ బ్యూటీ గోవాలో ఎంజాయ్ చేస్తోందట.

 
గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అప్సర రాణి అందుకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలతో షేర్ చేస్తూ హ్యాపీ మూమెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ వీడియోను చూసిన వర్మ తన స్టైల్లో స్పందించాడు. 

 
నువ్వు మాతో లేకుండా అక్కడెక్కడో ఉంటే అది హ్యాపీ సండే ఎలా అవుతుందని ట్వీట్ చేశాడు. వర్మ మెసేజ్‌కు అప్సరాకు కూడా రిప్లై ఇచ్చింది. వీడియోను షేర్ చేస్తాను.. బాగుంటుంది అంటూ చెప్పింది. దానికి దీనికి ఇక తేడా ఏముంది అంటూ కౌంటర్ రిప్లై ఇచ్చాడట ఆర్జీవీ.

 
అయితే వీరిద్దరి నాటీ చాటింగ్ సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. మరోసారి రాంగోపాల్ వర్మ ప్లే బాయ్ అన్న టాగ్‌ను తగిలిస్తూ కామెంట్లు కొడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడినా తాను మాత్రం ఇలాగే ఉన్నానంటున్నాడు రాంగోపాల్ వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments