Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్ లాక్ చేయ‌డం త‌ప్పేమి కాదు - మీనాక్షి చౌద‌రి

Advertiesment
Meenakshi Chaudhary
Meenakshi Chaudhary
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాలో ఓ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించింది. ఇందులో టైటిల్ సాంగ్‌లో ఆమె డాన్స్ చేసింది.  ట్రైల‌ర్‌లో లిప్‌లాక్ లు వున్నాయి. దీనిపై మీనాక్షి చౌద‌రి బాగానే స్పందించింది.   ఏ సినిమా అయినా పాత్ర నిడివి ఎంత అనేది చూడ‌ను. క‌థ‌లో భాగంగా కేరెక్ట‌ర్ ప్రాధాన్య‌త చూస్తాను. నా రెండో సినిమాకు ఇలాంటి సినిమా రావ‌డం గ్రేట్ అని తెలిపింది. తొలి సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదులో చేసింది. రెండో సినిమా ర‌వితేజ‌తో న‌టించింది.
 
ఖిలాడి  ట్రైల‌ర్‌లో లిప్‌లాక్ వున్నాయి దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నార‌నే దానికి ఆమె బ‌దులిస్తూ, క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాబ‌ట్టి కొన్ని అంశాలుంటాయి. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పినప్పుడే ఇలా వుంటుంది కేరెక్ట‌ర్ తీరు అని చెబుతారు. న‌టిగా నేను యాక్టింగ్ స్కూల్‌లో నేర్చుకున్న‌ది కూడా ఇదే. కేరెక్ట‌ర్‌ను వెంట‌నే జ‌డ్జ్ చేయ‌లేం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ వుంటాయి. అవి హ్యూమ‌న్ ఎమోష‌న్సే. అంత‌కుమించి లైన్ క్రాస్ చేయం. లిప్ లాక్ కూడా న‌ట‌న‌లో ఓ భాగ‌మే అంటూ చాలా క్లారిటీగా చెప్పేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వ్యక్తిగతమా? పరిశ్రమ కోసమా?