హీరో కుమార్తెను అయినప్పటికీ వాడుకోవాలని చూశారు.. వరలక్ష్మీ శరత్ కుమార్

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (10:28 IST)
తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన హీరో శరత్ కుమార్. ఈయన కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనీ చెప్పుకొచ్చింది. ఓ పెద్ద హీరో కుమార్తెను అయినప్పటకీ.. తనను కూడా వాడుకోవాలని ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదే అంశాన్ని ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఒక స్టార్ వారసురాలిని అయినప్పటికీ అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కానీ సినిమాల కోసం నా క్యారెక్టర్‌ను నేను వదులుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నా. అలాగే ఎదుగుతూ వచ్చా' అని వెల్లడించారు. 
 
తాను ఒక హీరో, రాజకీయ నాయకుడి కుమార్తెను అని తెలిసి కూడా కొంతమంది దర్శకులు, నిర్మాతలు చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని ఆమె చెప్పుకొచ్చింది. నేను కాస్టింగ్ కౌచ్‌కు లొంగనని పలువురు ప్రముఖులు చెప్పిన ఆడియో ప్రూఫ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని ప్రకటించింది. 
 
'అంతేకాదు మొదట్లో కాస్టింగ్ కౌచ్‌కు నేను నో చెప్పినందుకు చాలా మంది నాపై నిషేదం విధించారు. వాటన్నింటిని దాటుకొని నా స్వశక్తితో 25 సినిమాలను పూర్తి చేశా. 25 మంది మంచి నిర్మాతలు, దర్శకులతో నేను పనిచేశా. ఇటీవలే 29వ సినిమాకు సంతకం చేశా' అని వివరించింది. 
 
మహిళలు ఇప్పటికీ ప్రతి చోట ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. వాటిపై వారు ఖచ్చితంగా నోరు విప్పాలని ఆమె సూచించారు. కాగా మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న "క్రాక్" చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. 
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని హీరోయిన్ శ్రీరెడ్డి బహిర్గతం చేసిన విషయం తెల్సిందే. ఈమె పలువురు హీరోలపై ముఖ్యంగా, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో ఆమెకు బెదిరింపులు రావడంతో తన మకాంను హైదరాబాద్ నుంచి చెన్నైకు మార్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments