Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌కు దూరమైన వరలక్ష్మి.. విందులో శింబుతో చిందులు... త్రిషతో కలిసి...

తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు. కానీ హీరో విశాల్ లవర్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (15:59 IST)
తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు. కానీ హీరో విశాల్ లవర్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. హీరోయిన్‌గా సాధించిన గుర్తింపు కంటే.. విశాల్ లవర్‌గా బాగా పాపులర్ అయింది. 
 
అయితే, ఇటీవలి కాలంలో విశాల్, వరలక్ష్మి‌ల మధ్య ఎందుకు చెడిందో తెలియదు కానీ ఇద్దరి వారిద్దరిమధ్య దూరం బాగా పెరిగింది. తాజాగా వరలక్ష్మి... శింబు ఇచ్చిన విందులో పాల్గొని అతనితో కలిసి చిందులు వేసి కోడంబాక్కం వర్గాలను షాక్‌కు గురి చేసింది. పైగా ఈ కార్యక్రమంలో మరో హాట్ భామ త్రిష కూడా పాల్గొంది. 
 
విశాల్‌తో బ్రేకప్ అయ్యాక వరలక్ష్మి శింబుతో చాలా క్లోజ్‌గా ఉంటోంది. ఇది ఆసక్తిని రేకెత్తిస్తుంది. నడిగర్ సంగం విషయంలో కూడా శింబు, విశాల్‌కు ప్రత్యర్థి. ప్రస్తుత పరిస్థితుల్లో వరలక్ష్మి కూడా శింబుతో చేతులు కలపడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
నిజానికి న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల త‌ర్వాత విశాల్ ఒక్క‌సారిగా త‌మిళంతో పాటు సౌత్‌లో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో విశాల్‌-వ‌ర‌ల‌క్ష్మి జంట త్వరలో ఒక్కటవబోతోందని అందరూ చెవులు కొరుక్కున్నారు. 
 
ఈ సమయంలో మీడియా ముందుకు వచ్చిన వరలక్ష్మీ.. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు మొత్తం అబద్ధాలని, తన ప్రేమ, పెళ్లి అంతా సినిమాతోనే అని చెప్పుకొచ్చింది. దీంతో విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల ప్రేమాయ‌ణం కథ కంచికి చేరినట్టుంది. ఇపుడు శింబుతో కలిసి చిందులు వేయడంతో అతనితో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అమ్మాయిలను బుట్టలో పడేయడంలో శింబుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. అతనికున్న మాజీ ప్రియురాళ్ళలో టాలీవుడ్ నటి నయనతార కూడా ఉన్న విషయం తెల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments