Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలగని "ట్యూబ్‌లైట్".. పని చేయని రంజాన్ సెంటిమెంట్!

రంజాన్ పర్వదినానికీ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఒక అవినాభావ సంబంధం ఉంది. రంజాన్‌కు రిలీజ‌య్యే స‌ల్లూభాయ్ ప్ర‌తి చిత్రమూ సూప‌ర్‌హిట్టే. బాక్సీఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీ కురిపిస్తూ వచ్చాయి. కాన

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (17:31 IST)
రంజాన్ పర్వదినానికీ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఒక అవినాభావ సంబంధం ఉంది. రంజాన్‌కు రిలీజ‌య్యే స‌ల్లూభాయ్ ప్ర‌తి చిత్రమూ సూప‌ర్‌హిట్టే. బాక్సీఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీ కురిపిస్తూ వచ్చాయి. కానీ "ట్యూబ్‌లైట్" మాత్రం వెలగలేదు. తొలి రోజు నుంచే నెగ‌టివ్ టాక్ రావ‌డంతో ట్యూబ్‌లైట్ డిమ్ అయిపోయింది. ఫలితంగా తొలి వీకెండ్ ఆ సినిమా కేవ‌లం రూ.64.77 కోట్ల‌తో సరిపుచ్చుకుంది. 
 
దీనిపై ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వీకెండ్ క‌లెక్ష‌న్ల‌ను ట్వీట్ చేశాడు. అయితే అవి అంచ‌నాల‌కు చాలా దూరంగా ఉండిపోయాయి. మూడు రోజుల్లో కేవ‌లం రూ.64 కోట్లు అంటే ఈ సినిమా స‌ల్మాన్‌కు పెద్ద ఫ్లాప్‌నే మిగిల్చింది అంటూ తరుణ్ పేర్కొన్నాడు. 
 
కాగా, రూ.వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ట్యూబ్‌లైట్‌.. రంజాన్ సెల‌వు రోజు కావ‌డంతో ఇదొక్క రోజే క‌నీసం రూ.40 కోట్లు వ‌సూలు చేస్తుందని భావించింది. కానీ, నెగెటివ్ టాక్ రావడంతో టార్గెట్ చేసుకోవడం కష్టంగా మారింది. క‌నీసం రూ.155 కోట్ల నుంచి రూ.160 కోట్లు వ‌సూలు చేస్తేనే ఎంతోకొంత లాభాలు ఆశించవ‌చ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments