Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న తమ్ముడు చనిపోయాడు... నేడు షూటింగ్‌కెళ్లిన హీరో రవితేజ

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్, మహాప్రస్థానంలో ఆదివారం జరిగాయి. అదీ కూడా ఓ అనాథకు నిర్వహించినట్టుగా పూర్తి

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (16:04 IST)
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్, మహాప్రస్థానంలో ఆదివారం జరిగాయి. అదీ కూడా ఓ అనాథకు నిర్వహించినట్టుగా పూర్తి చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు రూ.1500 కూలి ఇచ్చి చితికి నిప్పుపెట్టించినట్టు సమాచారం.
 
అయితే, తమ్ముడు దుర్మరణం వార్త తెలుసుకున్న అన్న రవితేజ, ఆయన తల్లి రాజ్యలక్ష్మిలు కనీసం కడసారి చూసేందుకు సైతం వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కరుడుగట్టిన తీవ్రవాదులు చనిపోయినపుడు సైతం వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు చివరిచూపుకు నోచుకుంటారు. కానీ, భరత్‌ మాత్రం అందరూ ఉండి కూడా అనాథలా కనిపించకుండా పోయాడు.
 
ఈ నేపథ్యంలో రవితేజ తమ్ముడు చనిపోయిన మరుసటి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా ది గ్రేట్' షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతోంది. తమ్ముడి మరణంతో బాధలో ఉన్న రవితేజ షూటింగ్‌కు వస్తారో లేదో అని డైరెక్టర్ అనిల్ రావిపూడి షూటింగ్‌ను వాయిదా వేయాలనుకుని భావించారు. 
 
కానీ, హీరోనే స్వయంగా దర్శకుడికి ఫోన్ చేసి... ‘నేను షూటింగ్‌కు వస్తున్నాను’ అని చెప్పారట. దీంతో దర్శకుడు షూటింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేశారు. కాగా, ‘మనం’ సినిమా కోసం నిర్మించిన ఇంటి సెట్‌లో రవితేజ, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments