Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెంటపడుతున్న టాలీవుడ్ ముదురు భామలు.. ఎందుకో తెలుసా?

ఇండస్ట్రీలో తమ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కిస్తున్న కొత్త భామల కంటే ముదురు భామలకే క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అసలు విషయం ఏంటంటే ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగొందిన నాయికలు ఇప్పుడు అవకాశాలు లేక ఆ

Webdunia
సోమవారం, 18 జులై 2016 (14:01 IST)
ఇండస్ట్రీలో తమ అందాల ఆరబోతతో కుర్రకారును మత్తెక్కిస్తున్న కొత్త భామల కంటే ముదురు భామలకే క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అసలు విషయం ఏంటంటే ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగొందిన నాయికలు ఇప్పుడు అవకాశాలు లేక ఆంటీలుగా, అమ్మలుగా నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడా కోవలో సిమ్రాన్, మీనా, సాక్షి శివానంద్, మధుబాలలు కూడా చేరిపోయారు. 
 
తమ నటనతో ఒకప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేసిన ఈ ముదురు భామలు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు వీరితో టాలీవుడ్ అగ్రదర్శకుడు ఒకరు టచ్‌లో వున్నారట. ఆయనెవరోకాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో నిరూపిస్తామని ఆయన వెంట పడుతున్నారట. 
 
ఎందుకో తెలుసా అపుడెపుడో సినిమాల్లో నటించి కనుమరుగైన నదియాని తీసుకువచ్చి ''అత్తారింటికి దారేది'' మూవీ ద్వారా ఆమెకు అవకాశాల వెల్లువని తీసుకొచ్చాడు. ఆ సినిమా ద్వారా నదియా వరుస ఆఫర్స్‌తో బిజీ బిజీగా మారిపోయింది. అందుకే తమ రీఎంట్రీ ఈ దర్శకుడితోనే చేయాలని ముదురు భామలు ఆశపడుతున్నారట. మరి త్రివిక్రమ్ ఏ భామని కరుణిస్తాడో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments