Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయడం లేదా..? మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (15:18 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్... ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే.. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి బ్రేక్ పడటంతో.. ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ కానుందో క్లారిటీ లేదు. ఈ సినిమా కంప్లీట్ అయితే... ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది ఆసక్తిగా మారింది.
 
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కావడానికి టైమ్ పడుతుంది కాబట్టి.. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలంటే ఆలస్యం అయ్యేలా ఉంది. అందుచేత ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలనుకుంటున్నాడట.
 
ఇంతకీ ఎవరితో చేయనున్నాడు అంటే... విక్టరీ వెంకటేష్ - నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ మల్టీస్టారర్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్. త్వరలోనే పూర్తి వివరాలతో అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తాడని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments