Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష దెబ్బతో అపార్ట్‌మెంట్ అమ్ముకుంటున్న నిర్మాత...

పన్నెండేళ్ళ కెరీర్‌లో త్రిష తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. దాదాపు అగ్ర హీరోలతో నటించిన ఈమె ఈమధ్య వెనకడుగు వేసింది. అయితే.. ఆమెను ప్రత్యేకంగా తీసుకువచ్చి.. ఆమె మేనేజర్‌ గిరిధర్‌ 'నాయకి' అనే సినిమా తీశాడు. ఈ చిత్రంతో ఆమెకు నాయకిగా మళ్ళీ ఒక వ

Webdunia
శనివారం, 30 జులై 2016 (19:26 IST)
పన్నెండేళ్ళ కెరీర్‌లో త్రిష తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. దాదాపు అగ్ర హీరోలతో నటించిన ఈమె ఈమధ్య వెనకడుగు వేసింది. అయితే.. ఆమెను ప్రత్యేకంగా తీసుకువచ్చి.. ఆమె మేనేజర్‌ గిరిధర్‌ 'నాయకి' అనే సినిమా తీశాడు. ఈ చిత్రంతో ఆమెకు నాయకిగా మళ్ళీ ఒక వెలుగు వెలుగుతుందని భావించాడు. కానీ రిలీజ్‌ నాడే ఈ సినిమా మార్నింగ్‌షో విడుదల కాలేకపోయింది. కొన్ని లావాదేవీలతో నిర్మాత ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ సినిమాకుముందు.. 'లక్ష్మీరావే మా ఇంటికి' అనే సినిమా తీశాడు నిర్మాత. 
 
ఆ చిత్రం ఏవరేజ్‌లో ఆడినా.. పెద్దగా లాభాలు లేవని చెప్పుకొచ్చాడు. అయితే ఈసారి అప్పటి డిస్ట్రిబ్యూటర్లు నాయకిని కొనడం విడుదల చేయడం.. అది డిజాస్టర్‌గా మారడంతో.. నిర్మాత గిరిధర్‌ కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. అందుకు తనకున్న ఓ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసి లావాదేవీలు పరిష్కరిస్తామని ఛాంబర్‌ముందు ప్రకటించినట్లు సమాచారం. 
 
అయితే త్రిష మేనేజర్‌ కాబట్టి.. చాలా తక్కువ రెమ్యునరేషన్‌తో వచ్చిందనీ, నటించిన ఆర్టిస్టులు కూడా కొత్తవారు కావడంతో.. ఇచ్చింది పెద్దగా లేదనీ.. అయినా నష్టాలు ఎలా వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు. ఏదిఏమైనా.. తాను ఇందులో ఇన్‌వాల్వ్‌ కావడంలేదని త్రిష ఇప్పటికే స్పష్టం చేసేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments