Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్ హీరోయిన్లను వెంట తిప్పుకుంటున్న విజయ్ దేవరకొండ...

గీత గోవిందం సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండ తన సత్తా చాటాడు. తొలిరోజు ఓపెనింగ్స్‌తోనే కుమ్మేశాడు విజయ్ దేవరకొండ. అయితే అతని సరసన నటించేందుకు టాప్ హీరోయిన్లు నో అన్నారన్న విషయం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (19:49 IST)
గీత గోవిందం సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండ తన సత్తా చాటాడు. తొలిరోజు ఓపెనింగ్స్‌తోనే కుమ్మేశాడు విజయ్ దేవరకొండ. అయితే అతని సరసన నటించేందుకు టాప్ హీరోయిన్లు నో అన్నారన్న విషయం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. 
 
విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు యూత్‌కు ఎంతో క్రేజ్. అయితే విజయ్ సరసన నటించేందుకు దాదాపు పాతిక మంది హీరోయిన్లు నో చెప్పారంటే నమ్ముతారా. ఇది నిజంగానే జరిగిందట. పెళ్ళి చూపులు సినిమా హిట్ కాగానే గీత గోవిందం సినిమాను ప్లాన్ చేశారు. విజయ్ సరసన నటించేందుకు టాలీవుడ్ లోని అగ్రహీరోయిన్లు, మిడిల్ రేంజ్ హీరోయిన్లను అప్రోచ్ అయ్యారట. కానీ వారంతా ఈ అప్‌కమింగ్ స్టార్‌తో నటించలేమని రిజెక్ట్ చేసేశారట. 
 
హీరోయిన్లు వరుసగా నో అనడంతో సినిమాను పక్కన పెట్టేశారట దర్శకుడు పరశురాం. ఆ తరువాత అర్జున్ రెడ్డి విడుదలైంది. సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా విజయ్ దేవరకొండ రైజయ్యాడు. దాంతో సమంత కూడా అతనితో నటించేందుకు సిద్ధమై మహానటి సినిమాలో నటించింది. 
 
గీత గోవిందం హిట్టయిన తరువాత టాప్ హీరోయిన్లు విజయ్‌తో నటించేందుకు పోటీలు పడుతున్నారట. ఇప్పటికే సమంత నటించగా త్వరలో రాశీ ఖన్నా, ఆ తరువాత కాజల్ ఇలా ఒక్కొక్కరుగా విజయ్ దేవరకొండతో నటించేందుకు క్యూ కడుతున్నారట. తెలుగులోనే కాదు తమిళంలోను విజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments