Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథ నచ్చకపోవడంతో రూ.4 కోట్లు తిరిగిచ్చేసిన యువ హీరో!!

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (18:42 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో మంచి గుర్తింపుపొందారు. 
 
ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్‌ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
అయితే, కరోనా మహమ్మారి సమయంలో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు చిత్రం ఎంతో ప్రజాధారణ పొందింది. ఆ తర్వాత ఆయనతో సినిమాలు నిర్మించేందుకు అనేక బడా నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. కొందరు నిర్మాతలైతే ఏకంగా అడ్వాన్సులు కూడా ఇచ్చారు. 
 
అలా అడ్వాన్సుల ఇచ్చిన సంస్థల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఒకటి. తమ ప్రాజెక్టులో నటించటానికి నవీన్ పోలిశెట్టికి దాదాపు 4 కోట్ల రూపాయల మేరకు అడ్వాన్స్ ఇచ్చింది. 
 
అయితే, ఈ నిర్మాణ సంస్థ మేకర్స్ వినిపించిన కథ నవీన్ పోలిశెట్టికి ఏమాత్రం నచ్చక పోవడంతో తాను తీసుకున్న మొత్తం రూ.4 కోట్లను తిరిగి ఇచ్చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments