సినిమా మేజర్ వర్క్ విదేశాల్లో కానీ మరే ఇతర ప్రాంతాల్లోకానీ తీశాక కొంత ప్యాచ్ వర్క్ వుంటుంది. అంటే అక్కడ తీయలేకపోయిన సాధ్యంకాని సన్నివేశాలను తిరిగి హైదరాబాద్ వచ్చాక ఏదైనా స్టూడియోలో సెట్ వేసి తీయడం పరిపాటి. అదే పెద్ద పెద్ద బిల్డింగ్‌లో తీయాలంటో జూబ్లీహిల్స్‌లో వున్న ఏదైనా భవంతిలో లోపల పేచ్‌వర్క్ తీస్తుంటారు. అలాంటిదే సూప్టర్ స్టార్ మహేస్‌బాబు చేస్తున్న `సర్కారు వారి పాట` సినిమా దాదాపు సౌదీలోనే ఎక్కువ భాగం షూట్ చేసుకుంది. తిరిగి హైదరాబాద్ వచ్చేసింది చిత్ర యూనిట్ వారు తిరిగి వస్తుండగా ప్రత్యేక విమానంలో మహేస్‌బాబు ఫ్యామిలీ ఫొటోలు నమ్రత పోస్ట్ కూడా చేసింది.
ఇదిలా వుండగా, హైదరాబాద్‌లో సర్కారివారిపాట కొంత షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో మహేస్‌బాబు బేంక్ అధికారి హోదాలో వున్న కొన్ని షాట్స్ విదేశీ టెక్నీషియన్స్ సహకారంతో చిత్రీకరిస్తున్నారు. ఈ స్టిల్‌ను ఇలా పోస్ట్ చేశారు. కాగా, ఈ షూట్‌లో ప్రముఖ నటుడు సముద్రఖని పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్న ఈయన మంగళవారం నుంచి పాల్గొనట్టుగా సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.