Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ వార్తలు అబద్ధమంటూనే ఫామ్‌హౌస్‌లో అడ్డంగా బుక్కైనా దిశా పటానీ

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్ దిశా పటానీ. 'లోఫర్' చిత్రంలో నటించింది. క్యూట్ యాక్టింగ్‌తో యూత్‌ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. కానీ, ఆ చిత్రం త‌ర్వాత తెలుగులో

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (10:34 IST)
టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్ దిశా పటానీ. 'లోఫర్' చిత్రంలో నటించింది. క్యూట్ యాక్టింగ్‌తో యూత్‌ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. కానీ, ఆ చిత్రం త‌ర్వాత తెలుగులో ఆమెకి మంచి అవ‌కాశాలేవీ లేవు. అందాలతో పాటు డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నా.. లోఫర్ ఫెయిల్యూర్ అమ్మడిని టాలీవుడ్‌కు దూరం చేసింది.
 
కానీ, జాకీచాన్ మూవీలో ఆఫర్ పట్టేసిన ఈ హాట్ బ్యూటీ.. ఎప్పుడూ డీలాపడినట్టు కనిపించదు... హిట్ ఆర్ ఫెయిల్యూర్ తనకేం సంబంధం లేనట్టు ఫుల్ జోష్‌లోనే ఉంచింది. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ బయోపిక్‌లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ధోనీ పిక్ కోసం ఎక్కువ మోతాదులోనే అందాలను ఆరబోసింది. ఈ నేపథ్యంలో దిశా పటానీ ప్రేమాయణం బిటౌన్‌లో చర్చనీయాంశమైంది. 
 
జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్‌తో దిశాపటానీ డేటింగ్ చేస్తుందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరి మధ్య అనుబంధం చాలావరకు వెళ్ళిందని.. గుసగుసలు వినిపించాయి. కానీ మాకేమీ తెలియదన్నట్లుగా టైగర్ ష్రాఫ్, దిశా చెప్పారు. ఇలాంటి తరుణంలో దిశా పటానీ- టైగర్‌లు అడ్డంగా దొరికిపోయారు. 
 
ఇటీవల ఓ ఫామ్ హౌస్‌లో గడిపిన ఈ ఇద్దరు విడివిడిగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విడివిడిగా పోస్టులు పెట్టినా.. ఫోటోలను పరిశీలించిన నెటిజన్లు మాత్రం.. వీరిద్దరూ ఒకే ఫామ్ హౌస్‌లోనేని కనిపెట్టేశారు. ఒక్క సినిమాలో కూడా కలసి నటించక ముందే ప్రేమలో పడిన టైగర్, దిశా... బీ-టౌన్‌లో హాటెస్ట్ కపుల్‌గా గుర్తింపు పొందారు. ఇటీవలే వీరు కలసి నటించిన బేఫిక్రా ఆల్బమ్ రిలీజ్ అవ్వగా... వీరి హాట్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments