ముగ్గురు భామలు కావాలంటున్న సమంత భర్త! (Video)

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (16:03 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత భర్త అక్కినేని నాగ చైతన్య. ఈయన కూడా హీరోనే. అయితే, ఆయన కెరీర్‌లో ఒకటి రెండు మినహా సరైన హిట్లు లేవు. ఈ క్రమంలో మనం దర్శకుడు విక్రమ్ కుమార్ - చైతన్య కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. 
 
నిజానికి గతంలో వచ్చిన మనం చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు వీరిద్దరి క‌ల‌యిక‌లో ఓ చిత్రం రానుంది. ఈ చిత్రం పేరు "థ్యాంక్యూ". 
 
ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించ‌గా.. వ‌చ్చే యేడాది నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ కానుంది. 'మ‌జిలీ' సినిమా స‌క్సెస్ సాధించిన త‌ర్వాత నాగచైత‌న్య సినిమాల క‌థ‌ల ఎంపిక‌లో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 
 
ఆస‌‌క్తిక‌ర విష‌య‌మేంటంటే "థ్యాంక్యూ" చిత్రంలో చైతూ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌. గ్రామీణ యువ‌కుడు, ఎన్ఆర్ఐ, మ‌రో రోల్‌లో క‌నిపిస్తాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.
 
అంతేకాదు ఈ ప్రాజెక్టులో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు పూర్తి కాగా.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని టాక్‌. బీవీఎస్ క‌థ‌ను అందిస్తుండ‌గా.. విక్ర‌మ్ కుమార్ స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ చేస్తున్నాడు. 
 
దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా, నాగ చైత‌న్య ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి ల‌వ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments