Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెంపాలో నాట్స్ ఉచిత ఆహార పంపిణీ, థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా నాట్స్ దాతృత్వం

Advertiesment
NATS
, శనివారం, 28 నవంబరు 2020 (22:59 IST)
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా థ్యాంక్స్ గివింగ్ డేను పురస్కరించుకుని స్థానికులకు ఆహార పంపిణీ చేసింది.  ఐటీ సర్వ్ అలయన్స్ ప్లోరిడా విభాగం, బటర్ ప్లై ఫార్మసీ, అవెర్‌నెస్ యూఎస్‌ఏ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 
 
డాక్టర్ రమ్య పిన్నమనేని, డాక్టర్ విజయ్ ఫణి దలయ్, సోమంచి కుటుంబ, డాక్టర్ సుదర్శన్, రమ కామిశెట్టి ఈ ఆహారపంపిణీ ప్రధాన దాతలుగా ఆర్థిక సాయాన్ని అందించారు.  ధ్యాంక్స్ గివింగ్ డేను పురస్కరించుకుని భోజనంతో పాటు ఇరవై రకాల నిత్యావసరాలను కలిపి ఓ సంచిలో ఉంచి అందించడం జరిగింది. 350 మందికి ఇలా నాట్స్ ఆహార పంపిణీ చేసింది. ఈ సంచులను అందుకున్న ప్రతి ఒక్కరూ నాట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
 
నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపా విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, ఐటీ సర్వ్ అలయన్స్ హాస్పిటాలీటీ ఛైర్ ఆరికట్ల, నాట్స్ టెంపా బే జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, ఐటీ సర్వీసెస్ అలయన్స్ ఫ్లోరిడా విభాగం ప్రెసిడెంట్ భరత్ ములపురు,బటర్ ఫ్లై ఫార్మసీ నిర్వాహకులు టోనీ జన్ను, టుట్టు జన్ను, అవేర్‌నెస్ యుఎస్ఏ నుంచి డాక్టర్ బిక్కసాని కుటుంబం, నాట్స్ కోర్ టీం ప్రభాకర్ శాఖమూరి, శిరీష డొడ్డపనేని, విజయ కట్టా, బిందు బండా, నవీన్ మేడికొండ, భార్గవ్ మాధవరెడ్డి ,సతీష్ పాలకుర్తి తదితరులు ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆహార పంపిణీకి అద్భుతమైన మద్దతును ప్రదర్శించారు.
 
నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్/మార్కెటింగ్  వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ జోనల్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ మాజీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహించిన నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేలకు నాట్స్ టెంపా విభాగం ధన్యవాదాలు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేయం కాపాడుకోవాలి, లేదంటే ఆ సమస్యలతో సతమతం