Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో కాలేజీ అడ్మిషన్లపై నాట్స్ వెబినార్

Advertiesment
అమెరికాలో కాలేజీ అడ్మిషన్లపై నాట్స్ వెబినార్
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:09 IST)
చికాగో: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికా కాలేజీల్లో ప్రవేశాలపై నాట్స్ వెబినార్ నిర్వహించింది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విద్యార్థులు నేరుగా కౌన్సిలర్లను కలిసే అవకాశం లేకపోవడంతో వారికి అడ్మిషన్లపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.

ఈ తరుణంలో నాట్స్ చికాగో టీం అడ్మిషన్లపై విద్యార్ధుల సందేహాలను తీర్చేందుకు ఈ వెబినార్ నిర్వహించింది. ఇప్పటికే కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు, నాట్స్ టీం సభ్యులు తమ అనుభవాలను ఈ వెబినార్ ద్వారా పంచుకుని సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
 
నాట్స్ బోర్డు ఆఫ్ డైరక్టర్ మూర్తి కొప్పాక ఈ వెబినార్‌ను ప్రారంభించారు. నాట్స్ నేషనల్ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ లక్ష్మి బొజ్జ ప్రధాన వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ చికాగో చాప్టర్ అధ్యక్షులు వేణు కృష్ణార్దుల, నాట్స్ చికాగో యూత్ కమటీ కార్తీక్ మోదుకూరిలు ఈ వెబినార్‌ను విద్యార్ధులు, నాట్స్ సభ్యులతో అనుసంధానంచేశారు.
 
అభినవ్ తేజ చిలుకూరి (కాలిఫోర్నియా), రచన కండ్రు (ప్లోరిడా), శ్రేయ వీధులమూడి (ఓహియో), అనికేత్ కొప్పాక (ఇండియానా) శ్రీ అభినవ్ మక్కెన(ఇలినాయిస్), అమోఘ్ బాలినేని(ఇలినాయిస్) గీత్ తూనుగుంట్ల( టెక్సాస్) శ్రీచరణ్ మంచికలపూడి(మిస్సోరి) తదితరులు ఈ వెబినార్ ద్వారా తమ అనుభవాలను వివరించారు.
 
ముఖ్యంగా కాలేజీ అడ్మిషన్లలో దరఖాస్తు సమర్పించాల్సిన సమయం, అప్లికేషన్ ప్రొసెస్, లెటర్ ఆఫ్ రికమండేషన్, జీపీఏ, డ్యూయల్ ఎన్‌రోల్ మెంట్ క్రెడిట్స్, వంటి విషయాలను ఈ వెబినార్ ద్వారా ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చేలా చేశారు. శ్రీనివాస్ ఉయ్యూరు(ఎన్.ఆర్.ఐ స్ట్రీమ్స్) నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెబ్ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి,
 
నాట్స్ మార్కెటింగ్ రవి గుమ్మడిపూడి, నాట్స్ బోర్డు డైరెక్టర్లు వంశీ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, నాట్స్ కోశాధికారి మదన్ పాములపాటి, మిడ్ సెంట్రల్ జోన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ నిమ్మగడ్డ, మహిళా సాధికారిక కమిటీ ప్రసుధ నున్న, ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బిందు వీదులమూడి, చికాగో కో ఆర్డినేటర్ హరీశ్ జమ్ముల తదితరులు ఈ వెబినార్‌కు తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
 
కాలేజీ అడ్మిషన్స్ పైన ఇంత చక్కగా విద్యార్థుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన చికాగో చాప్టర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, మున్ముందు యువత భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నేలు   తెలియచేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యవ్వనంగా ఉండాలంటే రోజూ దాన్ని ఓ ముక్క నోట్లో వేసుకోండి!!