Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చికాగోలో నాట్స్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ

చికాగోలో నాట్స్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ
, సోమవారం, 17 ఆగస్టు 2020 (22:19 IST)
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చికాగో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించింది. ప్రవాస భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొని వారి జన్మభూమి పట్ల వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ఈ ర్యాలీ అనంతరం ప్రవాస భారతీయుల పిల్లలు జనగణమన అధినాయక జయహే అంటూ భారత జాతీయ గీతం పాడి భారత్ పైన తమకున్న ప్రేమను చాటారు. 
 
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికి మరిచిపోరాదని చాటేందుకు మాతృభూమిపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని నాట్స్ నాయకులు మదన్ పాములపాటి అన్నారు. ఈ ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నాయకులు కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బుజ్జా ఈ ర్యాలీ విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు.
 
చికాగో నాట్స్ విభాగ నాయకులు వేణు కృష్ణార్ధుల, ప్రసుధ సుంకర, బిందు వీధులమూడి, హరీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, భారతీ పుట్టా, పాండు చెంగళశెట్టి, మూర్తి కొగంటి తదితరులు తమ పూర్తి సహయ సహకారాలు అందించి ఈ ర్యాలీని దిగ్విజయం చేశారు. చికాగో యునైటెడ్ కమ్యూనిటీ నాయకులు చాందిని దువ్వూరి, లింగయ్య మన్నెలు కూడా ఈ ర్యాలీకి తమ వంతు తోడ్పాటు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌కు సరైన విరుగుడు స్టీమ్ థెరపీనే!!