Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో నాట్స్ వెబినార్

Advertiesment
Webinar
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:56 IST)
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో వెబినార్ నిర్వహించింది. ఎంత పెద్ద లెక్కయినా చిటికెలో చెప్పేసే భాను ప్రకాశ్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఆగస్ట్ 2020లో స్వర్ణ పతకం సాధించాడు.
 
నాలుగు ప్రపంచ రికార్డ్స్, 50 లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెడ్ ఎక్స్ స్పీకర్‌గా కూడా అంకెల రహస్యాలను చెప్పిన నీలకంఠ భాను ప్రకాష్ దాదాపు 15 దేశాల్లో వర్క్ షాప్స్ నిర్వహించి తన గణిత మేథస్సును ప్రపంచానికి చాటాడు. విద్యార్ధుల్లో లెక్కలంటే భయం పొగొట్టి.. అంకెలతో ఆడుకునేలా చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని నీలకంఠ భాను ప్రకాష్ తెలిపారు.
 
మ్యాథ్స్ మ్యాజిక్ విత్ భాను ప్రకాష్ పేరుతో నిర్వహించిన ఈ వెబినార్‌కు తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. విద్యార్ధులు కూడా ఈ వెబినార్‌లో పాల్గొని క్లిష్టమైన లెక్కలను అడగగా భాను ప్రకాశ్ వారికి క్షణాల్లో సమాధానం చెప్పడం అందరిని అబ్బుర పరిచింది. మ్యాథ్స్ ద్వారా మన మేథస్సును ఎలా పెంచుకోవచ్చు..? మన మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుందనేది ఈ వెబినార్‌లో నీలకంఠ భాను ప్రకాష్ వివరించారు.
 
ప్రవాస భారతీయులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. వారి సందేహాలను నివృత్తి చేశారు. నాట్స్ నుంచి నాయకులు గంగాధర్ దేసు, మురళీకృష్ణ మేడిచెర్ల ఈ వెబినార్‌కు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. మహిత అప్పసాని, సిద్ధార్థ జయంతి, సుచరిత జయంతి, భవిష్ గుమ్మడిలు ఈ వెబినార్‌లో ఉపయుక్తమైన ప్రశ్నలతో వెబినార్ ఆసక్తికరంగా చేశారు.
 
నాట్స్ బోర్డు డైరెక్టర్ గంగాధర్ దేసు, సిద్దార్ధ, సుచరితలను దృష్టిలో పెట్టుకుని భానుప్రకాష్‌ను ఉద్దేశించి, ఉభయభాషా పరిపక్వత వల్ల మేధోశక్తి పెరుగుతుందా అంటే, అది చాలా ఉపయుక్తంగా ఉంటుందని భాను వివరించిన వివరణతో మిగతా విద్యార్థులు ఏకీభవించారు. నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఈ వెబినార్‌ నిర్వహణకు సహాయ సహకారాలు అందించారు.
 
భాను ప్రకాష్ నిర్వహిస్తున్న ఎక్సప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అనే సంస్థ ద్వారా, అమెరికాలో తెలుగు వారికి సహాయ పడేందుకు తమ వంతు కృషిగా నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, ప్రెసిడెంట్ శేఖర్ అన్నే తెలియచేసారు. ఆన్లైన్‌లో విద్యార్థులు, తల్లితండ్రులు, అనేక మంది అడిగిన ప్రశ్నలకు, భాను ప్రకాష్ సమయాభావం వల్ల, నాట్స్ వరల్డ్.ఆర్గ్ ద్వారా సందేహ నివృత్తి చేస్తారు. నీలకంఠ భాను ప్రకాష్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలను ఈ నెల నాట్స్ అక్షర దీపికలో చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహ వాహనంపై శ్రీనివాసుడు, రాజసంతో ఊరేగుతూ..