Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప టైటిల్ మారిపోతుంద‌ట‌!

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (19:31 IST)
Allu arjun- pushpa
అల్లు అర్జున్ న‌టిస్తున్న కొత్త చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచానాలే వున్నాయి. క‌రోనా టైంలో షూటింగ్ వాయిదాప‌డ‌డంతోపాటు ఈ సినిమా టీజ‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాతోనే స్ట‌యిలిష్ స్టార్ కాస్త సుకుమార్ ఐకాన్ స్టార్‌గా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప్ర‌క‌టించాడు. తాను అలా ఎందుక‌న్నానో సినిమాచూశాక మీకే తెలుస్తుంద‌ని వెల్ల‌డించారు. అయినా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్‌పై కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డింది. 
 
ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సుకుమార్ బిన్నంగా ప్లాన్ చేసాడట. తొలి భాగానికి `పుష్ప.. ది రైజర్` ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు రెండో భాగానికి అద్భుతమైన టైటిల్ ఒకటి ఫిక్స్ చేస్తారట. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఈ సినిమా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగుతోంది. ఇలాంటి క‌థ‌కు రాజ‌కీయ అంశాలు ముడిప‌డివుంటాయి క‌నుక ఇది ఏ మేర‌కు హాట్ టాపిక్ అవుతుందో చూడాల్సిందే. మొద‌టి భాగం డిసెంబ‌ర్‌లో లేదా 2022 సంక్రాంతికి రిలీజ్ చేసి.. రెండో భాగాన్ని 2023లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments