Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్‌ "జై లవ కుశ"లో తమన్నా ఐటమ్ సాంగ్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జై లవ కుశ. ఈ చిత్రానికి సంబంధించిన మూడు రకాల టీజర్లను ఇటీవలే విడుదల చేశారు. అయితే, ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ పాటలో కనిపించనుంది. ఆ స్టార్ హ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (11:26 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జై లవ కుశ. ఈ చిత్రానికి సంబంధించిన మూడు రకాల టీజర్లను ఇటీవలే విడుదల చేశారు. అయితే, ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ పాటలో కనిపించనుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. తెల్లపిల్ల తమన్నా. 
 
ఈమె ఒక వైపున స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే.. మరో వైపున స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తోంది. 'అల్లుడు శీను'.. 'జాగ్వార్' వంటి సినిమాల్లో కొత్త కథానాయకుల కాంబినేషన్‌లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. అలాంటి తమన్నా 'జై లవ కుశ' సినిమాలోను స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవ కుశ' సినిమా.. షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది.
 
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో, తమన్నాతో చేయిస్తే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. తమన్నా ఎంత మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందన్నారు. ఇందుకోసం ఆమె భారీ మొత్తమే పారితోషికంగా అందుకోనుందని వినికిడి. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. 'జనతా గ్యారేజ్'లో "పక్కా లోకల్ .. "అనే స్పెషల్ సాంగ్ మాదిరిగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments