Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాకు జాక్‌పాట్ : 'జాగ్వార్‌'లో ఐటం సాంగ్‌.. రూ.2 కోట్ల రెమ్యునరేషన్

మాజీ ప్రధాని దేవగౌడ మనువడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (16:14 IST)
మాజీ ప్రధాని దేవగౌడ మనువడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఏ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ప్రేక్షకులు మెచ్చే విధంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
రూ.కోట్లు ఖర్చు పెట్టి తీస్తునప్న సినిమాలో ఐటం సాంగ్ లేకుంటే ఎలా? అదే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. సినిమాకు పెడుతున్న ఖర్చుకు తగ్గట్లే ఐటం సాంగ్ అదిరిపోవాలని భావించారు. సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్నశృతిహాసన్‌ అయితేనే ఐటం సాంగుకు పర్ఫెక్ట్ అని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారు. కానీ శృతి డేట్స్ కుదరవని, చేయలేనని సున్నితంగా తిరస్కరించింది. ఈ పాటకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని శృతికి చెప్పినప్పటికీ శృతిహాసన్ ఒప్పుకోలేదు. శృతి హాసన్ వదిలేసిన ఈ బిగ్ ఆఫర్ తమన్నాను వరించింది. 
 
ఒక పాటకు రెండు కోట్లంటే మాటలు కాదు. తమన్నా తెలివిగా… వెంటనే ఒప్పేసుకుంది. దీంతో యూనిట్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీసెట్‌లో హీరో నిఖిల్‌ కుమార్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాల‌పై ఈ స్పెష‌ల్‌సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ స్పెష‌ల్ సాంగ్ సినిమాలో మ‌రో హైలైట్‌గా నిల‌ుస్తుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. ఈ సాంగ్‌ను చిత్రీక‌రించ‌డంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా 'జాగ్వార్‌' చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments