Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి చెన్నై వస్తే, మా ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందే : ధోనీకి హీరో సూర్య ట్వీట్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోలీవుడ్ హీరో సూర్య ఈ విజ్ఞప్తి చేశారు. మరోమారు చెన్నైకు వస్తే ఖచ్చితంగా తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందేనంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:49 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోలీవుడ్ హీరో సూర్య ఈ విజ్ఞప్తి చేశారు. మరోమారు చెన్నైకు వస్తే ఖచ్చితంగా తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందేనంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎమ్‌ఎస్‌ ధోని: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ'. ఈ చిత్రం ప్రమోషన్‌ నిమిత్తం ఎంఎస్.ధోనీ చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా, భార్య జ్యోతిక, పిల్లలు దివా, దేవ్ సహా సూర్య ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
సూర్య పిల్లలు ధోనీతో కొంతసేపు గడుపగా, ఈ ఫోటోలను సూర్య పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సూర్య ఓ ట్వీట్ చేశాడు. "మరోసారి చెన్నై వస్తే మాతో డిన్నర్ చేయాలి. మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు. మా పిల్లలకు మధురమైన క్షణాలను అందించారు" అంటూ తన ట్వీట్‌‌లో సూర్య పేర్కొన్నారు. కాగా, ధోనీ బయోపిక్ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments