Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్లు చిన్నవాడైన రణబీర్‌తో రొమాన్స్ చేసిన ఐష్... రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయట

ఐశ్వర్యరాయ్‌ వివాహం తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించింది. "జజ్బా", "సరబ్జీత్" చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాన్స్‌కు అసలు అవకాశమే లేదు. ఐశ్వర్యని తమ కలల రాణిగా ఊహించుకునే అభి

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:01 IST)
ఐశ్వర్యరాయ్‌ వివాహం తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించింది. "జజ్బా", "సరబ్జీత్" చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాన్స్‌కు అసలు అవకాశమే లేదు. ఐశ్వర్యని తమ కలల రాణిగా ఊహించుకునే అభిమానులకు ఆ రెండు సినిమాలు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఐశ్వర్యరాయ్ అభిమానులకు నచ్చే విధంగా కనిపించబోతోంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్‌తో రొమాన్స్ చేస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను యూనిట్ సభ్యులు ఇటీవల రిలీజ్ చేసారు. టీజర్ ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా టీజర్లో చూపించిన రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో మాజీ సుందరితో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తున్నప్పటికీ ఆమెను డామినేట్ చేసే విధంగా ఐశ్వర్యరాయ్ అందం ఉందని సినీవర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో అనుష్క-ఐశ్వర్యలు పోటీపడి నటించారు. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్య రాయ్ రెచ్చిపోయింది. ఈ సినిమాతో మళ్ళీ ఐశ్వర్యరాయ్ వరుస సినిమాలతో బిజీ అవ్వడం ఖాయమని సినీజనాలు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments