Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌కు అనారోగ్యం.. చికిత్స కోసం అత్యవసరంగా యుఎస్ పయనం

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఇటు కుటుంబ సభ్యులు, అటు చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇస్తున్నప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. రజినీ అనారోగ్యం కారణంగా యుఎస్‌కి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. 'రోబో

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (10:42 IST)
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఇటు కుటుంబ సభ్యులు, అటు చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇస్తున్నప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. రజినీ అనారోగ్యం కారణంగా యుఎస్‌కి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. 'రోబో 2' షూటింగ్‌లో ఉన్న‌పుడే ర‌జినీ అనారోగ్యం గురించి తెలిసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే స‌డ‌న్‌గా ర‌జినీ యుఎస్ వెళ్లిన‌ట్లు త‌మిళ మీడియా కోడై కూస్తోంది. 
 
కబాలి మూవీ షూటింగ్ తర్వాత అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు అమెరికాలో చికిత్స తీసుకున్న రజినీకాంత్ మళ్ళీ చెకప్ కోసం అమెరికా వెళ్ళాడని సమాచారం. శంకర్ తెరకెక్కిస్తోన్న రోబో సీక్వెల్ షూటింగ్‌లో రజినీ ఇటీవలే జాయిన్ కాగా కొంత టాకీ పార్ట్ పూర్తి చేశారు. ఉక్రెయిన్‌లో కూడా సాంగ్స్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. 
 
అయితే ఉన్నట్టుండి రజినీ చెకప్ కోసం అమెరికా వెళ్ళాడనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజినీతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కొందరు కుటుంబ సభ్యులు అమెరికా వెళ్ళారని సమాచారం. రజినీ హీరోగా తెరకక్కుతున్న 2.0 చిత్ర షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తి కాగా, కొన్ని సాంగ్స్‌ని చిత్రీకరించాల్సి ఉంది. 
 
ఇక ఆ తర్వాత గ్రాఫిక్‌వర్క్స్‌ని కూడా శరవేగంగా పూర్తి చేసి నవంబర్‌లో ఫస్ట్ లుక్‌ని, వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో చిత్ర యూనిట్ ఉంది. 2.0 చిత్రం సగానికి పైగా గ్రాఫిక్స్ నేపథ్యంలోనే రూపొందనుండగా, రజినీకాంత్ నటించాల్సిన పార్ట్ దాదాపు పూర్తైందనే టాక్స్ వినిపిస్తున్నాయి. మరి రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments