భాను ప్రియకు ప్రపోజ్ చేసిన వంశీ.. కానీ పెళ్ళికి భానుప్రియ తల్లి నో చెప్పిందట..
ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం, వంశీ కాంబినేషన్.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. త
ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం, వంశీ కాంబినేషన్.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. తన అభినయంతో తెలుగువారిని పులకింపచేసింది. అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, వివిధ పాత్రల్లో తనదైన బాణీ పలికించింది. 1980-1993 మధ్య కాలంలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలో ఉంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు.
'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ కాంబినేషన్ సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలందరితోను కలిసి నటించిన భానుప్రియ ప్రస్తుతం తల్లి, వదిన పాత్రలతో నటిస్తూ అందరిని మెప్పిస్తోంది.
వెండి తెరపై గ్యాప్ తీసుకున్న భానుప్రియ ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర మీద కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడట. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పాడట. భానుప్రియ తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది. ఇంతకీ భానుప్రియకు లవ్ ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా .. సీనియర్ దర్శకుడు వంశీ. అప్పట్లో వంశీ సినిమా అంటే అభిమానులకు అదో క్రేజ్.
నిజానికి భానుప్రియ టాప్ హీరోయిన్‌గా ఎదగడానికి ముఖ్యకారణం వంశీ. ఆమెను ఎంతో ప్రత్యేకంగా, అందంగా చూపించేవాడు.. భానుప్రియతో వంశీ తెరకెక్కించిన ''సితార'', ''అన్వేషణ'', ''ఆలాపన'' లాంటి సినిమాల్లో భానుప్రియ అందంగా కనిపిస్తుంది. ఆ సినిమాలు తీస్తున్నప్పుడే భానుప్రియ అంటే వంశీకి ఇష్టం ఏర్పడి ఆమెకు ప్రపోజ్ చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని అన్నాడట. అయితే వీరి పెళ్లికి భానుప్రియ తల్లి నో చెప్పిందట. అప్పటికే వంశీకి పెళ్ళయిపోయిందట.