Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారనే కావాలంటున్న అట్లీ.. అమ్మడు క్రేజే కారణం..?

నయనతార.. ఈ పేరు వినగానే ఇటు అభిమానులే కాదు దర్శకనిర్మాతలు ఆమెపై ఎంతో ఇష్టాన్ని, అభిమానాన్ని కనబరుస్తారు. నయనతార ఒకవైపు గ్లామర్ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలుగింటి

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (09:44 IST)
నయనతార.. ఈ పేరు వినగానే ఇటు అభిమానులే కాదు దర్శకనిర్మాతలు ఆమెపై ఎంతో ఇష్టాన్ని, అభిమానాన్ని కనబరుస్తారు. నయనతార ఒకవైపు గ్లామర్ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలుగింటి సీతమ్మగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. కేవలం తెలుగులోనే కాదు తమిళం మలయాళ భాషలలో కూడా ఈ అమ్మడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం నయనతార కొన్ని బడా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. 
 
క్ష‌ణం తీరిక లేని న‌య‌న‌తారతో సినిమాలు తీసేందుకు దక్షిణాది స్టార్ హీరోల నుంచి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వ‌ర‌కు అందరూ ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ సైతం త‌న సినిమాలో న‌య‌న‌తారే హీరోయిన్‌గా కావాలని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా... కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్. 
 
ఆయనతో ఒక్క‌ సినిమా అయినా చేయాలని అక్కడి హీరో హీరోయిన్లు అనుకుంటుంటే ఈయన మాత్రం త‌న తదుపరి చిత్రంలో న‌య‌న‌తారే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెనే ఎంచుకున్నాడ‌ట‌. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 61 చిత్రం అట్లీ దర్శకత్వంలో త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార ఎంపికైంది. ఆమెను ఈ సినిమాలో డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో మరింత గ్లామర్‌గా అట్లీ చూపించనున్నాడట. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments