Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - మహేష్ - రాజమౌళి కాంబినేషన్.. మరో మల్టీస్టారర్ మూవీ

SS Rajamouli
Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:01 IST)
దర్శక దిగ్గజం ఎస్ఎస్. రాజమౌళి మరో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్చచల్ చేస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ప్రభాస్, మహేష్ బాబులు హీరోలుగా నటించనున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి "ఆర్ఆర్ఆర్" వర్కింగ్ స్టిల్స్ పేరుతో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మరో మల్టీస్టారర్‌కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
సినిమా విజయానికి కావాల్సిన సూత్రాలన్నీ ఒడిసిపట్టుకున్న రాజమౌళి.. అపజయమెరుగని దర్శకుడిగా ఖ్యాతి పొందాడు. ఒక సినిమాకి మించి మరొక చిత్రం తీస్తూ.. అభిమానుల అంచనాలను అందుకోవడంలో సఫలీకృతుడవుతున్నాడు. 
 
ఇకపోతే, 'బాహుబలి' భారీ విజయం తర్వాత.. 'ఆర్.ఆర్.ఆర్'తో బిజీ అయ్యాడు జక్కన్న. 'బాహుబలి' సిరీస్‌కి ఏమాత్రం తీసిపోని రీతిలో 'ట్రిపుల్ ఆర్' తెరకెక్కుతుంది. ఈ చిత్రం శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. 
 
ఈ క్రేజీ మల్టీస్టారర్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేయబోతున్నాడు? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. అయితే.. లేటెస్ట్‌గా రాజమౌళి నెక్స్ట్‌ మూవీపై ఓ న్యూస్ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. తన తదుపరి సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్'కి మించిన మరో మల్టీస్టారర్‌ రూపొందించేందుకు కసరత్తులు మొదలుపెట్టాడట జక్కన్న. 
 
నిజానికి మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కె.ఎల్.నారాయణ ఆ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే మహేశ్‌ బాబుతో పాటు తన తర్వాతి సినిమా కోసం ప్రభాస్‌ని కూడా లైన్లో పెడుతున్నాడట. 'ఆర్.ఆర్.ఆర్'కి మించిన రీతిలో మహేశ్-ప్రభాస్‌తో భారీ మల్టీస్టారర్‌కి ప్లాన్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments