Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌తో మూవీ కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్న జక్కన్న? (video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (08:44 IST)
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం చూడాలన్నది సినీ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ, అది ఇంతవరకు సాధ్యపడలేదు. మరో రెండేళ్ళ తర్వాత అభిమానుల కోరిక నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి దర్శకుడు రాజమౌళి ఓ కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం టాలీవుడ్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. 
 
నిజానికి ప్రస్తుతం రాజమౌళి "ఆర్ఆర్ఆర్" ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలు. ఈ మల్టీస్టారర్ మూవీని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. దీంతో 'ఆర్ఆర్ఆర్' నిర్మాణం పూర్తవడంలో జాప్యం జరుగుతోంది. షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నా, ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. రాజమౌళి ఇప్పుడు మహేశ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనిపై కూర్చున్నట్టు తాజా సమాచారం. మహేశ్ ఇమేజ్‌కి తగ్గా స్టోరీ లైన్ ఇప్పటికే రాజమౌళి అనుకున్నప్పటికీ, దానికి ఇప్పుడు ఓ తుది రూపాన్ని ఇస్తున్నట్టు చెబుతున్నారు. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', మహేశ్ చేస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాలు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజక్టు సెట్స్‌కి వెళుతుంది. పాన్ ఇండియా చిత్రంగా నిర్మించే ఈ చిత్రంలో మహేశ్‌ని రాజమౌళి ఎటువంటి పాత్రలో చూపిస్తాడన్నది ఆసక్తికరం



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

బంగ్లాదేశ్ బాలికపై 200మంది లైంగిక దాడి.. 3 నెలల పాటు నరకం చూపించారు..

12 యేళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మంది అఘాయిత్యం - 10 మంది అరెస్టు

కౌలాలంపూర్-చెన్నై కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. ఎవరికి ఏమైంది?

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments